పూర్ణ ముద్దులు.... లిప్ స్టిక్ ముద్రలు
on Sep 25, 2021

హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పూర్ణకు ఓ అలవాటు ఉంది. జడ్జ్‌గా వ్యవహరిస్తున్న డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో ఎవరి పెర్ఫార్మన్స్ అయినా నచ్చితే వాళ్లకు ముద్దులు ఇవ్వడం, బుగ్గ కొరకడం అలవాటుగా చేసుకున్నారు. గతంలో కొంతమంది కంటెస్టెంట్లకు ముద్దులు ఇచ్చారు. ఒకసారి చైతన్య మాస్టర్ కు ముద్దు ఇస్తే ఈటీవీ వాళ్ళు సెన్సార్ కట్ చేశారు.
గతంలో పెట్టిన ముద్దులను పక్కన పెడితే... లేటెస్టుగా మొన్న బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో నైనికా పెర్ఫార్మన్స్ నచ్చడంతో ఆమెకు పూర్ణ ముద్దులు పెట్టింది. అయితే, దానికి ముందు గతంలో తానూ ముద్దులు పెట్టినప్పుడు కొంతమంది చేసిన కామెంట్స్ చూసి హార్ట్ అయ్యానని పూర్ణ చెప్పారు. 'ఢీ' షోలో ఉన్నవాళ్ళందరూ తనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చిన్న పిల్లలు లాంటోళ్లని... తన తోబుట్టువులకు ఈ వయసు గల పిల్లలు ఉన్నారని ఆమె వెల్లడించారు. ముద్దులు పెట్టడాన్ని ఎవరు ఎలా తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని పూర్ణ స్పష్టం చేశారు. తనకు ఎటువంటి సమస్య లేదన్నారు.
నైనికాకు ముద్దులు పెట్టిన తర్వాత ఆమె బుగ్గపై పూర్ణ లిప్ స్టిక్ ముద్రలు స్పష్టంగా కనిపించాయి. ఆ విషయం ప్రదీప్ గమనించాడు. తెల్ల పౌడర్ మీద లిప్ స్టిక్ ముద్రలు ఎంతబాగా కనిపిస్తున్నాయో అని అతడు అనడంతో అందరూ నవ్వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



